గ్రేటర్ వార్ ! ఇది చాలా సంథింగ్ స్పెషల్ ఎందుకంటే ?

-

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకుంది. నేడు ఓటర్ తన తీర్పును బ్యాలెట్ బాక్సులో వేసేందుకు అప్పుడే బారులు తీరారు.దీంతో ఓటరు తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందో.. ఎవరికీ ప్రతికూలంగా ఉంటుందో స్పష్టత లేకపోవడంతో ,అందరూ ఉత్కంఠగానే ఉన్నారు. ఈ గ్రేటర్ వార్ లో ఎవరు విజేత అనేది మరో నాలుగు రోజుల పాటు, టెన్షన్ గా ఎదురు చూడాల్సిన పరిస్థితి . అసలు ఈ గ్రేటర్ ఎన్నికలు చాలా సంథింగ్ స్పెషల్ ..! ఎందుకంటే ఎప్పుడూ ఎక్కడా లేనటువంటి ఎన్నో ప్రత్యేకతలు ఈ గ్రేటర్ ఎన్నికలలో సంతరించుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల ప్రచారంలో హోరెత్తించాయి.
ముఖ్యంగా బిజెపి ఈ ఎన్నికలకు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి సైతం ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఈ నగరానికి రావడం ప్రత్యేకత సంతరించుకుంది.  నేరుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పోయినా, ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా సైతం ఇక్కడకు వచ్చి వెళ్లారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. ఇలా చెప్పుకుంటూ వెళితే బీజేపీ కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు ఎంతోమంది గ్రేటర్ లో ప్రచారం నిర్వహించారు. ఈ ఎదురు దాడిని టిఆర్ఎస్ తట్టుకుంటూనే గ్రేటర్ లో పట్టు మరోసారి సాధించేందుకు గట్టిగా ప్రచారం నిర్వహించింది.
అసలు ఒక్క కార్పొరేషన్ ఎన్నికలకు దేశవ్యాప్తంగా హడావిడి జరగడం,  అన్ని రాష్ట్రాలు ఇక్కడ ఎన్నికలపై ఆసక్తి గా ఉండడం వంటి ఎన్నో ప్రత్యేకతలు చోటుచేసుకున్నాయి. 150 డివిజన్ లు ఉన్న గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో 1122 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 9101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.గ్రేటర్ పరిధిలోని 150 డివిజన్లలో అత్యధికంగా పోలింగ్ కేంద్రాలు ఉన్న  డివిజన్ గా కొండాపూర్ ఉంది. ఈ డివిజన్ లో 99 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం గ్రేటర్ పరిధిలో 74. 44 లక్షల మంది ఓటర్లు ఉండగా, అందులో పురుషులు 38,77 ,688 , మహిళా ఓటర్లు 35, 65, 896, ఇతరులు 676 మంది ఉన్నారు. ఈ ఎన్నికల కోసం పోలింగ్ సిబ్బంది 48 వేల మంది పని చేస్తుంటే భద్రతా ఏర్పాట్ల కోసం 52 వేల మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగేందుకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. దీనికోసం భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కావడంతో తెల్ల రంగు బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేశారు. చాలా రోజుల తర్వాత బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఓటర్ కార్డు లేకపోయినా 18 రకాల గుర్తింపు కార్డులు ఏదో ఒక దానిని ఉపయోగించుకొని ఓటు వేసే విధంగా అవకాశం కల్పించారు. నిన్న కొన్ని    చెదురుమదురు సంఘటనలుు మినహా,    రాజకీయ పార్టీల మధ్య వివాదాలుుు చోటు చేసుకున్న, ఊహించిన దానికంటే కాస్త ప్రశాంత వాతావరణం ఉన్నట్టుగానే కనిపిస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version