ఏపీకి మరో రెండు రోజుల పాటు వాన ముప్పు ఉందని వాతావణశాఖ వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతం ,దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో అరో అల్ప పీడనం ఏర్పడింది. అది రానున్న 24 గంటల్లో బలహీన పడుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
దాని ప్రభావం తోనే రాబోయే 48 గంటల్లో రాష్ట్రం లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంతే కాకుండా విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇదిలా ఉంటే గత రెండు రోజుల నుండి గులాబ్ తుఫాన్ కారణంగా ఏపీ తెలంగాణ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.