మెగాస్టార్ వారసుడిగా చిరుత సినిమాతో అడుగుపెట్టి ఆ తర్వాత మగధీరతో టాలీవుడ్ రికార్డులు అన్నింటిని తిరగరాసి మెగాధీరుడుగా పేరు సంపాదించుకున్నారు రామ్ చరణ్.. ఇక ఈరోజు ఆయన తన 38వ పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన నట ప్రస్థానం గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. 1985 లో మార్చి 27న చెన్నైలో జన్మించిన రామ్ చరణ్.. చిరుత సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా వరకు 14 సినిమాలలో హీరోగా నటించారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో మాత్రం తన తండ్రితో కలిసి గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చిన రామ్ చరణ్ అదే సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.
ఇకపోతే మగధీర సినిమాతో రికార్డులు బ్రేక్ చేసిన రామ్ చరణ్ ఆ తర్వాత ఆరెంజ్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. జంజీర్ మూవీ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తండ్రి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అంతేకాదు తన తండ్రితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఆచార్య సినిమా డిజాస్టర్ అవడంతో మళ్లీ ఆయన ఆ వైపు అడుగులు వేయలేదు. ఇక రంగస్థలం లాంటి సినిమా మరొకవైపు రాంచరణ్ కు భారీ విజయాన్ని అందించింది. ఎవడు , నాయక్ , ధృవ వంటి సినిమాలు కూడా రామ్ చరణ్ కు మంచి పేరు తీసుకొచ్చాయి.
ఇకపోతే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా చేసిన ఈయన ఆ సినిమాలోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు అందుకొని ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు.ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాకు గేమ్ చేంజర్ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం.