ఎడిట్ నోట్: సజ్జల ‘చేతుల్లోనే’!

-

సజ్జల..సజ్జల..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు..అసలు వైసీపీలో అంతా సజ్జల అన్నట్లే పరిస్తితి కనిపిస్తోంది. అటు పార్టీ పరమ్గా అయినా, ఇటు ప్రభుత్వ పరంగా అయినా..ఏ నిర్ణయం తీసుకోవాలన్న…దాన్ని మీడియా ముందు చెప్పాలన్న మొత్తం సజ్జల చేతుల్లోనే. సీఎంకు సంబంధించిన అంశాలైన..ఏ మంత్రి శాఖకు సంబంధించిన విషయాలైన..సజ్జల వచ్చి మీడియా ముందు మాట్లాడాల్సిందే..అటు పార్టీ పరమైన నిర్ణయాలైన సజ్జలే మీడియా ముందుకు వస్తారు.

ఇక బహిరంగ సభల్లో జగన్ మాట్లాడే స్పీచ్ లు కూడా సజ్జలనే రెడీ చేస్తారనే విమర్శలు ఉన్నాయి. అంటే ఏదైనా ఇంకా సజ్జల మాత్రమే అన్నట్లు పరిస్తితి. అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలకైనా..వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలుకైనా సజ్జల టార్గెట్ అవుతున్నారు. ఇటీవల సజ్జల వర్సెస్ రెబల్స్ అన్నట్లు వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి ఈ నలుగురుని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సజ్జల ప్రకటించారు. అలాగే వీరు చంద్రబాబుకు అమ్ముడుపోయారని ఆరోపించారు. దీంతో రెబల్ ఎమ్మెల్యేలంతా రివర్స్ అయ్యారు..సజ్జల ఓ పనికిమాలిన సలహాదారుడు అని, ఆయన వల్ల వైసీపీ నాశనం అవుతుందని అంటున్నారు.

ఇక టి‌డి‌పి నుంచి నలుగురు, జనసేన నుంచి ఒక ఎమ్మెల్యేని వైసీపీ ఎంతకు కొన్నదని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. విలేఖరిగా పనిచేసే సజ్జల వేల కోట్లు ఎలా సంపాదించారని ఆనం లాంటి వారు ప్రశ్నిస్తున్నారు. అసలు సజ్జల వల్ల తనకు ప్రాణహాని ఉందని శ్రీదేవి ఆరోపిస్తున్నారు. ఇలా అందరూ సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు. కానీ జగన్ పై పెద్దగా విమర్శలు చేయడం లేదు. మొత్తం సజ్జల టార్గెట్ గానే విరుచుకుపడుతున్నారు. అంటే వైసీపీలో సజ్జల ఏంటి అనేది అర్ధమవుతుంది. అయితే ఇంకా వైసీపీ పైకి లేవాలన్న లేదా మునిగిపోవాలన్న సజ్జల చేతుల్లోనే ఉందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version