HBD Samantha: ఆ ఘనత ఒక్క సమంతకే సాధ్యం..!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఈరోజు తన 37వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె సాధించిన ఘనత గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం. చలనచిత్ర పరిశ్రమలో హీరోయిన్ సమంతది ఒక ప్రత్యేకమైన ప్రయాణం.. ఏ మాయ చేసావే చిత్రంతో జెస్సీగా ఆకట్టుకున్న ఈమె 2010లో కెరియర్ ప్రారంభించి.. దాదాపు 13 సంవత్సరాలుగా టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.

లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి మెప్పించింది. ఇప్పటివరకు ఈమె చేసిన ప్రతి సినిమాలో కూడా ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా ఉండేలా చూసుకుంది. అంతే కాదు ఈమె చేసిన ప్రతి క్యారెక్టర్ కూడా గతంలో ఏ ఒక హీరోయిన్ కూడా చేయలేదు అన్నట్టుగా తన క్యారెక్టర్ ను మార్చుకుంది. అందుకే ఈమెకు ఉన్నంత డైహార్ట్ ఫ్యాన్స్ హీరోయిన్స్ లో మరెవరికి లేరని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే బాపట్లలో ఒక అభిమాని ఈమె కోసం ఒక గుడిని కూడా నిర్మిస్తూ రికార్డు సృష్టిస్తున్నారు.

ఇక సమంతా చేసిన అద్భుతమైన పాత్రల విషయానికి వస్తే.. రామ్ చరణ్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలంలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో జీవించేసింది. ఆంధ్ర స్లాంగ్ ను అచ్చు గుద్దినట్లు దింపింది.. ఇక నాగచైతన్య, సమంత నటించిన మజిలీ చిత్రంలో భర్త ఏం చేసినా భార్య వెనకేసుకు వస్తూ ప్రేమించే పాత్రలో సమంతా నటన మరో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి క్లైమాక్స్ లో సమంత పెర్ఫార్మెన్స్ కు కన్నీళ్లు రావాల్సిందే.

మరొకవైపు ఓ బేబీ.. 25 ఏళ్ళున్న వయసు మాత్రం 60 ఏళ్లు అన్నట్లుగా కనిపించే పాత్రలో అదరగొట్టేసిందనే చెప్పాలి. ఈ పాత్రలో సమంత తప్ప మరెవరు నటించలేరు అన్నట్టుగా చెరగని ముద్ర వేసుకుంది. ఇటీవల వచ్చిన యశోద సినిమా.. అద్దె గర్భం కాన్సెప్ట్ లో వచ్చిన ఈ సినిమాలో తన చెల్లెల్ని కాపాడేందుకు ఆమె వేసే ఎత్తుగడలు, విలన్లతో పోరాటం, యాక్షన్ సన్నివేశాలు అందరిని కూడా బాగా అలరించాయి. ఇక గ్లామర్ పరంగా పాత్రలతో అలరించడమే కాదు ఆధ్యాత్మికంగా కూడా ఆకట్టుకుంది. తాజాగా శాకుంతలం సినిమాలో శకుంతల పాత్రలో జీవించేసింది కానీ ఊహించని విధంగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో అదరగొట్టేసింది. ఇలా ఒక్కటేమిటి ఈమె ఏ పాత్ర చేసినా పూర్తిస్థాయిలో భిన్నంగా ఉండేలా చూసుకుంది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version