HCA: క్రికెటర్లకు గుడ్‌ న్యూస్‌..HCA స‌మ్మ‌ర్ క్యాంప్స్ షెడ్యూల్ విడుద‌ల‌

-

HCA: క్రికెటర్లకు గుడ్‌ న్యూస్‌..HCA స‌మ్మ‌ర్ క్యాంప్స్ షెడ్యూల్ విడుద‌ల‌ అయింది.  15వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభం కానుంది. 18వ తేదీ సాయంత్రం 6 గంట‌ల లోపు లాస్ట్ డేట్‌ ఉండనుంది. మొత్తం 27 సెంట‌ర్ల‌లో క్యాంప్స్‌ ఉంటాయి. ఈనెల 20 నుంచి 30 రోజుల పాటు ప్ర‌త్యేక శిక్ష‌ణ‌ ఉండనుంది. క్రికెట‌ర్ల‌కు ఉచిత శిక్ష‌ణ‌తో పాటు పౌష్ఠికాహారం అందిస్తారు.

HCA Summer Camps Schedule Release

ప్ర‌తి క్యాంప్‌లో 80 నుంచి 100 మంది పిల్ల‌ల‌కు అవకాశం ఉండనుంది. బాలురకు అండ‌ర్‌- 14, 16, 19.. బాలిక‌ల‌కు అండ‌ర్‌-15, 19 వ‌యో విభాగాల్లో శిక్ష‌ణ ఇవ్వనున్నామని ఇప్పటికే హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శ‌న‌ప‌ల్లి జగన్ మోహన్ రావు వెల్లడించారు. మ‌రిన్ని వివ‌రాల కోసం హెచ్‌సీఏ అధికారిక వెబ్‌సైట్ (http://hycricket.org)ను సంద‌ర్శించి, తెలుసుకోవ‌చ్చు అని చెప్పారు హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్శ‌న‌ప‌ల్లి జగన్ మోహన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version