ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. నేడు జనసేన నాయకులు మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవాళ ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.

మెగా బ్రదర్ నాగబాబు తో పాటు సోము వీర్రాజు, బీద రవిచంద్ర, బీటి నాయుడు అలాగే కావలి గ్రీష్మ ఎమ్మెల్సీలుగా ఇవ్వాలా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో… ఈ ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. వైసిపి పార్టీకి సరైన బలం లేకపోవడంతో… ఈ ఐదుగురు ఎన్నిక ఏకగ్రం అయింది. ఇక ఇవాళ ఈ ఐదుగురు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు.