HCU భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలి.. హైకోర్టులో పిటిషన్!

-

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 400 ఎకరాల యూనివర్సిటీ భూములను వేలం వేయొద్దని విద్యార్థులు ఆందోళనలు చేపడుతున్న తరుణంలో పోలీసులు అక్కడ భారీగా మోహరించారు.నిరసనలు చేస్తున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారికి మద్దతు తెలిపిందుకు వెళ్తున్న బీజేపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. మరోవైపు కేటీఆర్‌ను సైతం హౌజ్ అరెస్టు చేశారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని కోరుతూ హైకోర్టులో పిల్ దాఖలైంది. వట ఫౌండేషన్ అనే స్వచ్చంధ సంస్థ మంగళవారం మధ్యాహ్నం ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిసింది. కాగా, ఆ 400 ఎకరాలు ప్రభుత్వానికి చెందినవని గతేడాది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో.. హైకోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news