తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొందరు ప్రభుత్వ అధికారులు ఓవర్ యాక్షన్ చేశారని, వాళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షమించినా..తాను మాత్రం అస్సలు క్షమించనని వార్నింగ్ ఇచ్చారు .
గత ఐదు సంవత్సరాలలో రాష్ట్ర ప్రజల కోసం అనేక ఇబ్బందులు పడ్డానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం సాధించడంతో ఏపీకు మంచి రోజులు వచ్చాయని అన్నారు.మరోవైపు, చంద్రబాబు కేబినెట్ 4.0లో మంత్రి పదవి దక్కకపోవడంపైన అయ్యన్నపాత్రుడు ఆయన స్పందిస్తూ..తనకు మంత్రి పదవి రాకపోయిన ఏం అసంతృప్తి లేదని తెలిపారు. కాగా, ఎన్డీఏ కూటమి విజయం సాధిండచంతో ఏపీ సీఎంగా నాలుగో సారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, చంద్రబాబు మంత్రివర్గములో అయ్యన్నపాత్రుడు, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలకు చోటు దక్కకపోవడం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.