కల్కి మూవీ ప్రమోషన్స్ మామూలుగా లేవుగా..!

-

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తోన్న తాజా చిత్రం కల్కి 2898 ఏడీ .ఈ సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ మూవీపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో తెరెకెక్కుతున్న ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రమోషన్లు వేగం పెంచారు.

ఇందు కోసం LED స్క్రీన్లు ఏర్పాటు చేసిన వాహనాలను ఎంచుకుంది. దీనికి సంబంధించిన వీడియోను కల్కి టీమ్ పంచుకుంది. దేశమంతా వెలుగును పంచే యాత్ర ప్రారంభమవుతుందని ట్వీట్ చేసింది. దీంతో కల్కి కాన్వాయ్ అదిరిపోయిందని సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.కాగా ఈ చిత్రం లో అమితాబ్‌, కమల్‌హాసన్‌, దీపిక పదుకొణే, దిశా పటానీ ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు.ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుదల అయిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version