బీఆర్ఎస్ నేతలు కావాలనే డ్రామాలు ఆడుతున్నారని, ఓ చిల్లర ఎమ్మెల్యే గురించి ఇంత సీన్ చేయాల్సిన అవసరం ఏముందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. ఆయనో చిల్ల ర ఎమ్మెల్యే అని పైర్ అయ్యారు.
బంజారా హిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన కౌశిక్ అక్కడ సిబ్బందిపై దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.వారి విధులకు భంగం వాటిల్లేలా ప్రవర్తించినందుకే ఆయనపై కేసు నమోదైందన్నారు.ఈ మధ్య హరీశ్‌రావు మానసిక స్థితి బాగోలేదని, చట్ట ప్రకారం కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. ఓ చిల్లర ఎమ్మెల్యే గురించి బీఆర్ఎస్ నేతలు ఇంత డ్రామా చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టారంటూ గొంతు చించుకుని అరుస్తున్న హరీశ్‌రావు ఏ హోదాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని మంత్రి నిలదీశారు.