ఏడాది మా ఆయనదే.. ఆర్ఆర్అర్ విజయంపై ఉపాసన ఆసక్తికర కామెంట్స్

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది తమకు ఎంతో ఆనందాన్ని మిగిల్చిందని.. చరణ్ ఎన్నో ప్రశంసలు అందుకున్నారని చెప్పుకొచ్చారు. అలాగే కచ్చితంగా ఈ ఏడాది చరణ్ దేనని చెప్పవచ్చు అంటూ తెలిపారు.

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. తొందర్లోనే ఈ సినిమాకు ఆస్కార్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. అయితే తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఉపాసన.. చరణ్ ఈ సంవత్సరం ఎన్నో ప్రశంసలు అందుకున్నారని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు..

తాజాగా అర్అర్అర్ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి సంపాదించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్ సైతం వచ్చింది. అలాగే ఈ సినిమాలో నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్బరిలో నిలవగా త్వరలోనే ఆస్కార్ అందుకొనుందని వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన ఉపాసన… ‘‘ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాట షూటింగ్ కోసం చరణ్ ఉక్రెయిన్ కు వెళ్లినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా నేను చరణ్ కు వెన్నంటే నిలుస్తాను. అతను కూడా నాకు ప్రతి విషయంలో ఎంతో సపోర్టివ్ గా నిలబడ్డారు. అలాగే చరణ్ కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందనే చెప్పాలి. వర్క్ విషయంలో కూడా ఎంతో సంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే ఈ ఏడాది ఎన్నో ప్రశంసలు అందుకున్న చరణ్ త్వరలోనే మరిన్ని ఆనందాలు అందుకుంటారని భావిస్తున్నా.. అందుకే ఈ ఏడాది కచ్చితంగా చరణ్ దే..” అంటూ చెప్పుకొచ్చారు ఉపాసన..

Read more RELATED
Recommended to you

Exit mobile version