పిల్లి నోట్లో వేలుపెట్టాడు.. 15 ఆపరేషన్లు చేసిన ప్రాణం దక్కలేదు..!

-

ఇంట్లో ఏదో ఒక పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలామందికి అలవాటుగా మారింది. కుక్కలు, పిల్లలు కామన్‌గా అందురు పెంచుకునేవి. వాటిని ఎంతలా ప్రేమిస్తారంటే.. అవి జంతువులు అన్న సంగతి కూడా మర్చిపోయి.. మీదేసుకుని ముద్దులు పెట్టుకుంటూ వాటిని నాకుతూ అబ్బో ఎంతో ఇష్టంగా చూసుకుంటారు. ఇంకా వాటితో ఆడేప్పుడు వాటి నోట్లు వెళ్లు కూడా పెడతారు.. ఇలా చేసే ఓ వ్యక్తి ప్రాణాలు కోల్బోయాడు. పిల్లి నోట్లో వేలు పెట్టాడు.. అది కరిచింది. సీన్‌ కట్‌ చేస్తే..

హెన్రిక్ అనే 33 ఏళ్ల వ్యక్తిని తన ఇంట్లో పెరిగిన పిల్లులలో ఒకటి కరిచింది. అయితే ఇది అతని మరణానికి కారణమవుతుందని పాపం అతను అస్సలు ఊహించలేదు. 15 ఆపరేషన్లు చేసినా కూడా అతని ప్రాణాన్ని మాత్రం కాపాడలేకపోయారు. అతను ఒక నెల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందు చివరికి కోలుకోలేక చనిపోయాడు.

డెన్మార్క్ నివాసి అయిన హెన్రిక్ క్రీగ్‌బామ్ ప్లాట్‌నర్ 2018 సంవత్సరంలో పిల్లిని దాని పిల్లలను తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి వాటిని తనతోనే పెంచుకున్నాడు.. ఆ పిల్లుల్లో ఒకటి.. అతని వేలు కొరికింది.. అప్పుడు అది లైట్‌ తీసుకున్నాడు. కాని కొద్దిసేపటికే అతని చేయి బాగా ఉబ్బి ఆసుపత్రిలో చేరాడు. నెల రోజులు అక్కడే ఉన్నారు. అతనికి 15 ఆపరేషన్లు చేశారు. ఘటన జరిగి 4 నెలలు గడుస్తున్నా అతని వేలు సరిగా పనిచేయకపోవడంతో వేలి భాగాన్ని కోయాలని వైద్యులు నిర్ణయించారు.

వేలు కోసినా హెన్రిచ్‌కి ఉపశమనం లభించలేదు. అతని తల్లి చెప్పిన వివరాల ప్రకారం.. హెన్రిచ్ రోగనిరోధకశక్తి పూర్తిగా క్షీణించింది. అతను న్యుమోనియా, ఆర్థరైటిస్, మధుమేహంతో బాధపడుతున్నాడట… చివరకు ఈ సంవత్సరం అక్టోబర్‌లో హెన్రిచ్ మరణించాడు. వాస్తవానికి, పిల్లి కాటు కారణంగా అతను ఓ రకమైన బ్యాక్టీరియా బారిన పడ్డాడు.. పిల్లి కాటును ఎవరూ తేలిగ్గా తీసుకోవద్దని హెన్రిచ్‌ భార్య తెలిపింది. నిజానికి ఇంట్లో పెంచుకునే జంతువులతు వాక్సిన్‌ వేయించాలి. కానీ చాలామంది ఈ పని చేయడం లేదు. దీనివల్ల రకరకాల అంటువ్యాధులు, వైరస్‌ల బారిన పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version