ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం నాలుగు సార్లు సీఎంగా పనిచేశానని, కానీ ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి దుర్భర పరిస్థితుల్ని చూడలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఐదేళ్లలోనే గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని విమర్శించారు.శుక్రవారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన మీటింగులో చంద్రబాబు కీలకవ్యాఖ్యలు చేశారు.
గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి, రాష్ట్రం అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా భవిష్యత్తులో టీడీపీని ముందుకెలా తీసుకెళ్లాలన్న దానిపై సమీక్షించాలని పార్టీ నేతలకు సూచించారు.ప్రస్తుతం జాతీయ స్థాయిలో భాగస్వామ్యంగా ఉన్నామని, మిత్రపక్షాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. టీడీపీకి విశ్వసనీయత ఉందన్న చంద్రబాబు.. తాము అధికారం కోసం కాకుండా దేశం కోసం పనిచేస్తున్నామన్నారు.
ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా తాము పదవులు అడగలేదన్నారు.