టీంలో అతను ఉండాలి: సెహ్వాగ్

-

ఐపిఎల్ లో ఢిల్లీ కేపిటల్స్ ప్లే ఆఫ్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్ కి చేరుకోవడమే కాకుండా రెండో స్థానంలో నిలిచింది. కీలకమైన మ్యాచ్ లో ఢిల్లీ కీలక ఆటగాడు రహానె 46 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టుకి మంచి విజయాన్ని అందించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించి, ప్లే ఆఫ్స్‌ కు నెం .2 గా అర్హత సాధించింది.

ఇక రహానే టి20 లకు పనికిరాడు అనే విమర్శలపై టీం ఇండియా మాజీ ఆటగాడు సెహ్వాగ్ స్పందించాడు. “చాలా కొద్ది మంది మాత్రమే అతన్ని టి 20 ఆటగాడిగా రేట్ చేస్తారు. అతను ఫోర్లు మరియు సిక్సర్లు కొట్టలేడని వారు అంటున్నారు, కానీ మీ జట్టులో అతనిలాంటి ధృడమైన ఆటగాడు ఉన్నప్పుడు… మీరు మరొక వైపు నుండి సమర్ధంగా దాడి చేయవచ్చు” అని సెహ్వాగ్ చెప్పాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version