తాను రాజీనామా చేస్తా.. భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా..? : హరీశ్ రావు

-

“నేను రాజీనామా లేఖను స్పీకర్ ఫార్మాట్ లో ఇస్తా.. డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క రాజీనామా చేస్తారా”..? అని ప్రశ్నించారు హరీశ్ రావు. ఆర్థిక అంశం పై చర్చ సందర్భంగా అసెంబ్లీలో హరీశ్ రావు మాట్లాడారు. పదేళ్లలో రాష్ట్ర సొంత ఆదాయాన్ని భారీగా పెంచాం. అప్పులు కాదు.. మిగులు బడ్జెట్ తోనే రాష్ట్రాన్ని అప్పగించామని తెలిపారు. నేతి బీరకాయలో నెయ్యి శాతం ఎంతనో.. భట్టి విక్రమార్క మాటల్లో నిజాలు అంతా అన్నారు.

Harish Rao

కాంగ్రెస్ అప్పు సంవత్సరానికి 1లక్ష 52వేల కోట్లు.. అంటే ఐదేళ్లలో 7 లక్షల కోట్లు దాటుతుందన్నారు. కానీ పాత అప్పులను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఖాతాలో వేసిందని తెలిపారు. రైతు బీమా ఇన్సూరెన్స్ చెల్లించలేదని అబద్దాలు చెబుతున్నారు. మేము పదేళ్లలో 7లక్షల కోట్లు చేస్తే.. ఐదేళ్లలోనే 7లక్షలు కోట్లు చేస్తారని తెలిపారు హరీశ్ రావు. ఓఆర్ఆర్ టెండర్ రద్దు చేసి విచారణకు ఆదేశించాలని కోరుతున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version