ఎస్సైని లాఠీతో చితకబాదిన కానిస్టేబుల్…!

-

లాక్ డౌన్ అమలు కోసం పోలీసులు తీవ్ర స్థాయిలో కష్టపడుతున్నారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా పోలీసులు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. జనాలు బయటకు రాకుండా చూడటానికి గానూ తీవ్రంగా కష్టపడుతున్నారు పోలీసులు. ఈ సమయంలో వారిలో అసహనం వచ్చినా సరే దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ప్రజలను కాస్త కట్టడి చేస్తున్నారు.

ఈ సమయంలో ఒక కానిస్టేబుల్ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేసాడు. ప్రజలను కట్టడి చేసే పోలీసు కానిస్టేబుల్ ఎస్సై మీద దాడి చేసాడు. ఉత్తరప్రదేశ్ లో సీతాపూర్ జిల్లా కొత్వాలీలో హెడ్‌ కానిస్టేబుల్ రామ్ సరాయ్‌ లాక్‌డౌన్‌ లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎండ ఎక్కువగా ఉండటంతో ఒక కానిస్టేబుల్ రామ్ సరాయ్ గారూ కాసేపు విశ్రాంతి కోసం కుర్చీలో కూర్చున్నారు. దీనితో సీరియస్ అయిన ఎస్సై రమేష్ నువ్వు తనిఖీ సరిగా చేయడం లేదని ముందు తిట్టాడు.

చూసీ చూడనట్లు వదిలేస్తున్నావని రామ్ సరాయ్ ని తిట్టడం మొదలు పెట్టాడు. ఎండలో నిలబడి గంటల తరబడి అలసిపోయిన రామ్ కి ఒళ్ళు మండిపోయింది. అంతే ఇక తన చేతిలో ఉన్న లాఠీ తో దాడి చేయడం మొదలుపెట్టాడు. పక్కన ఉన్న వాళ్ళు ఆపినా సరే ఆగలేదు. ఎస్సై ఆపడానికి ప్రయత్నాలు చేసినా సరే దాడి ఆగలేదు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనితో జిల్లా ఎస్పీకి సమాచారం అందింది. వెంటనే విచారణ చేపట్టి సస్పెండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version