స్టూడెంట్స్ కి బ్లూ ఫిలిమ్స్ చూపించి… హెడ్ మాస్టర్ దారుణం…!

-

ఉపాధ్యాయుడు అంటే పాఠాలు నేర్పాలి. జీవితంలో ముందుకి నడిపించాలి. విద్యార్ధులకు మార్గదర్శి అవ్వాలి. వారి జీవితానికి కొత్త పాఠాలు నేర్పాలి. కాని ఒక ప్రధాన ఉపాధ్యాయుడు మాత్ర౦ తన శారీరక సుఖం తీర్చుకున్నాడు. తన వాంఛ తీర్చుకున్నాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. ఒక ప్రధాన ఉపాధ్యాయుడు చేసిన పని ఇప్పుడు విమర్శలకు వేదికగా మారింది. అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే గుంటూరు జిల్లా రాజుపాలెంట మండల గణపవరం జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉన్న ఎలిమెంటరీ స్కూల్ హెడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు మనవరాలి వయసున్న విద్యార్థినులతో మసాజ్ చేయించుకోవడంతో పాటుగా వారికి రోజు నీలిచిత్రాలు చూపించడం, అసభ్యంగా ప్రవర్తించడ౦ సుఖం తీర్చుకోవడం వంటివి చేస్తున్నాడు. చాలా మందిని ఇదే విధంగా వేధించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

విద్యార్ధులు ఈ విషయం తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళడంతో ప్రధానోపాధ్యాయుడి వికృత చేష్టల గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. విసిగిపోయిన విద్యార్ధినులు ఈ విషయం మొత్తం పూసగుచ్చినట్టు తల్లి తండ్రుల దృష్టికి తీసుకువెళ్ళడం తో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ తల్లిదండ్రులు స్కూల్‌కు వచ్చి వెంకటేశ్వరరావును దేహశుద్ధి చేసారు. పోలీసులకు ఫోన్ చేసి అతడిని వారికి అప్పగించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఎంవో… వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. తదుపరి విచారణ కు ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version