అబ్బబ్బ ఇండియాలో ఫ్లయిట్ ఎక్కేముందు ట్రంప్ వేసిన స్కెచ్ మామూలుగా లేదు .. !

-

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన చాలా హాట్ హాట్ గా సాగుతుంది. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో ద్వైపాక్షిక సంబంధాలు వాణిజ్య ఒప్పందాల సమావేశం ముగిసిన అనంతరం మోడీ మరియు డోనాల్డ్ ట్రంప్ కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ..రక్షణ భాగస్వామ్యంలో రెండు దేశాలు కీలకంగా మారనున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో ఈ భూమండలంలో అత్యంత డేంజర్ మరియు ఉత్తమమైన సైనిక ఆయుధాలను అమెరికా తయారు చేసిందని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

అంతేకాకుండా భారత సైన్యం గతంలో ఎప్పుడూ లేనంత స్థాయిలో అమెరికాతో సంయుక్త విన్యాసాలు చేపడుతోందన్నారు. రక్షణరంగానికి అత్యాధునిక ఆయుధాలు సమకూర్చబోతున్నాం, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్‌పై ఉమ్మడి కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

 

ఇదే సందర్భంలో డోనాల్డ్ ట్రంప్ ఫ్లైట్ ఎక్కే ముందు శత్రుదేశం పాకిస్థాన్ కి అదేవిధంగా చైనా కి కూడా చెక్ పెట్టే విధంగా భారత్ సరిహద్దుల గురించి సంచలన ప్రకటన చేయబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కచ్చితంగా ఈ స్టేట్మెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇస్తే స్కెచ్ మామూలుగా ఉండదు ఆసియాలోనే పవర్ ఫుల్ కంట్రీగా భారత్ అవతరించడం గ్యారెంటీ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version