దానిమ్మ ఆరోగ్యానికి దివ్యౌష‌ధ‌మే…

-

స‌హ‌జంగా దానిమ్మ‌ను తినడానికి చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. ఎర్రగా నిగనిగ లాడుతూ కంటికి ఇంపుగా కనిపించే దానిమ్మ గింజలు ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం కలిగిస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న దానిమ్మ‌ రోగనిరోధక శక్తిని పెంపొందించ‌డంలో సహాయ పడుతుంది. సీజన్లతో సంబంధం లేకుండా మనకు దానిమ్మ పండ్లు మ‌న‌కు ల‌భిస్తాయి. ఈ పండ్ల‌ను నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.

దానిమ్మ తొక్కలో కూడా అనేక ఔషధ గుణాలు ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ దానిమ్మ తొక్కను సన్‌స్క్రీన్‌గా, మాయిశ్చరైజర్‌గా, ఫేషియల్ స్క్రబ్‌గా ఉపయోగించుకోవచ్చని బ్యూటీ నిపుణులు చెబుతున్నారు. అయితే దానిమ్మ ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా పెంపొందించ‌డంలో ఏ మాత్రం తీసిపోలేదు. అలాగే దానిమ్మ వ‌ల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేయండి..

– రక్తహీనత తో బాధపడేవారు దానిమ్మ గింజలను లేదా జ్యూస్ కానీ రెగ్యులర్ గా తీసుకుంటుంటే శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.

– దానిమ్మ రసాన్ని రోజూ తాగితే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. హార్ట్ ఎటాక్స్ రాకుండా స‌హాయ ప‌డుతుంది.

– దానిమ్మతొక్కల్లో ఉండే ఏజెంట్స్‌ చర్మ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంది. మ‌రియు దానిమ్మ తొక్కను ఫౌడర్‌గా చేసి ఉపయోగిస్తే చర్మానికి అవసరమేయ్యే తేమను అందిస్తుంది.

– జీర్ణవ్యవస్థను చాలా వేగవంతంగా పనిచేయించుటలో దానిమ్మ కీల‌క‌ పాత్ర పోషిస్తుంది. మలబద్దక సమస్య ఉన్నవారు కూడా దానిమ్మను తీసుకోవడం  చాలా మంచిది.

– దానిమ్మలో ఉండే ఔషధ గుణాలు రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంచుతుంది.

– ఎముకల ఆరోగ్యానికి కూడా దానిమ్మ చాలా మంచిది. ఆస్టియో ఆర్థ్రయిటిస్‌తో బాధపడేవారికి  దానిమ్మ పండు రసం తీసుకుంటే చాలా మంచిది.

– వయసు పెరిగే కొద్దీ ఏర్పడే ముడతలను కూడా దానిమ్మ రసం నివారిస్తుంది. అలాగే కేశ సంరక్షణ కోసం కూడా  మంచిగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

– దానిమ్మలోని పోషక విలువలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దాంతో రక్తప్రసరణ కూడా సాఫీగా జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version