గుండె కరిగే దృశ్యాలు.. ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

-

తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా పంట, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు బీభత్సం సృష్టించగా, ఆదిలాబాద్‌, వరంగల్, మహబూబాబాద్‌లో వాగులు ఉప్పొంగి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అంతేకాకుండా వేల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. అయితే, నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే, ప్రస్తుతం సీఎం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ముంపు గ్రామాల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు భారీ సంఖ్యలో ముందుకు కదులుతున్నారు. అయితే, ఖమ్మం జిల్లాలో పర్యటన సందర్భంగా ఆయన పలువురి ఇళ్లల్లోకి వెళ్లి వరద పరిస్థితులను ప్రత్యక్షంగా వీక్షించగా.. ‘గుండె కరిగిపోయే దృశ్యాలంటూ సీఎం కామెంట్ చేశారు. ఆ దృశ్యాలను వీక్షించాక వారి మనోవేధన అర్థమైంది.బాధితుల ముఖాల్లో ఆవేదన తప్పా ఏమీ లేదు. మరోవైపు అన్న వచ్చాడన్న భరోసా ఉంది. వీళ్ల కష్టం తీర్చడానికి కన్నీళ్లు తుడవడానికి ఎంతటి సాయమైనా చేయడానికి తెలంగాణ సర్కార్ సిద్ధం’ అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news