Breaking : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

-

నైరుతు రుతిపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఈసారి గట్టిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు భారత వాతావారణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఈ నెల 9వ తేదీన తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయని ఐఎండీ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు ఉత్తరాదిన, దక్షిణాదిన ఇంకొన్ని రాష్ట్రాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. కోస్తాంధ్రలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయని, ఓవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతుండటంతో పాటు ఉపరితల ఆవర్తనం కూడా తోడవడమే భారీ వర్షాలకు కారణంగా చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు.

ఐఎండీ అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. రానున్న 5 రోజుల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన కర్ణాటక, కేరళలోనూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో అక్కడి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. హసన్ పట్టణంలో కురుస్తున్న భారీ వర్షాలతో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో అనేక ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోగా.. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే తమిళనాడులోనూ ఏపీ, కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం ఉండనుంది. ఇక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌ఘఢ్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గుజరాత్, అస్సాం రాష్ట్రాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version