హైదరాబాద్‌ను వీడనంటున్న వరుణుడు.. పలు చోట్ల భారీ వర్షం

-

హైదరాబాద్‌ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మాదాపూర్‌, షేక్‌పేట, టోలిచౌకి, రాయదుర్గం, గండిపేట, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పర్‌, బండ్లగూడ జాగీర్‌ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అత్తాపూర్‌, శివరాంపల్లి ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్‌పల్లి, ఎల్లమ్మబండ, గోల్కొండతో పాటు తదితర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తుండగా.. వాహనాలు ఇబ్బందులకు గురయ్యారు. జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, చింతల్‌, గాజులరామారం, సుచిత్ర, ఆల్విన్‌ కాలనీ, హైదర్‌నగర్‌, నిజాంపేట్‌, ప్రగతినగర్‌, బాచుపల్లి, కొంపల్లి భారీ వర్షం కురుస్తున్నది.

మారేడ్‌పల్లి, రాణిగంజ్‌తో సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, బొల్లారం, బేంగంపేట్‌, ప్యారడైజ్‌, చిలుకలగూలో వర్షం కురుస్తున్నది. వర్షానికి షేక్‌పేటలో రోడ్లు జలమయమయ్యాయి. ఇదిలా ఉండగా.. రాబోయే అరగంటలో శేరిలింగంపల్లి జోన్‌ పరిధిలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని జీహెచ్‌ఎంసీ, ఈవీడీఎం డైరెక్టర్‌ ట్వీట్‌ చేసింది. వర్షం హెచ్చరికల నేపథ్యంలో డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమై రంగంలోకి దిగాయని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version