వరుణుడి బాదుడు.. తడిసి ముద్దైన.. తెలుగు రాష్ట్రాలు..

-

ఎడతెరిపిలేకుండా గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దాయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. మరికొన్ని చోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. నిర్మల్ జిల్లా ముధోల్‌లో నిన్న ఒక్క రోజే 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడది తుడుచిపెట్టుకుపోయింది. అయితే ఇప్పటికే తెలంగాణకు రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు వాతావరణ శాఖ అధికారులు.. రాష్ట్రంలో నేడు, రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.

ఇదిలా ఉంటే… ఏపీలో సైతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో స్టేట్‌ కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా.. జిల్లాల వారీగా కూడా కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలని సీఎంవో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే తప్ప బయటకు ప్రజలు రావద్దని సూచలు జారీ చేశారు. మరో రెండు రెండు రోజుల పాటు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version