హైదరాబాద్‌లో భారీ వర్షం.. జీహెచ్‌ఎంసీ కీలక ప్రకటన

-

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. గత రెండు రోజులుగా కొంత ఉపశమనం కలిగినా.. ఇవాళ సాయంత్రం నుంచి నగర వాసులను వర్షాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సోమవారం నాడు సాయంత్రం నుంచి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, యూసఫ్‌గూడ, అమీర్‌పేట్, వెంకటగిరి ప్రాంతాలతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం మొదలైంది.

ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కారణంగా పంజాగుట్ట నిమ్స్ దగ్గర, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. రాగల మూడు గంటలపాటు నగరాన్ని వర్షం ముంచెత్తనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆఫీసు నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో సిటీలో భారీగా ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు నరకం చూస్తున్న పరిస్థితి. రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఐటీ కారిడార్ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుంది. రాయదుర్గం, గచ్చిబౌలి, కొండాపూర్, కేబుల్ బ్రిడ్జి మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు చుక్కలు చూస్తున్న పరిస్థితి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version