గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో… వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే, ఇక ఈ వర్షాలతో హైదరాబాద్ నగరం మొత్తం నిండుకుండలా మారిపోతుంది. తాజాగా ఈ రోజు కురిసిన భారీ వర్షంతో… హైదరాబాద్లోని పలు ప్రాంతాలు మొత్తం జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ఫిలింనగర్ మాదాపూర్ గచ్చిబౌలి మెహదీపట్నం కూకట్పల్లి పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది
దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులన్నీ వరద నీటితో నిండిపోయాయి. దీంతో నగరంలోని కొన్ని ప్రాంతాలు భారీ వర్షం తో నిండికుండల మారిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఇలా భారీ వర్షాలతో వరదలు రావడం కూడా ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తోంది.