Breaking : హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం..

-

ఉన్నట్టుండి హైదరాబాద్ లో హట్టాతుగా వాతావరణం చల్లబడింది. కొన్ని చోట్ల వర్షం కురిసింది. నగరంలోని పలు ప్రాంతాలతో పాటు… శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. మరోవైపు పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేపట్టింది ఐఎండీ. సిటీలోని రాజేంద్రనగర్, మణికొండ, పుప్పాలగూడ, మెహదీపట్నం, జియాగూడ, లంగర్ హౌస్, చార్మినా, బంజరాహిల్స్, గచ్చిబౌలి, ఉప్పల్, రామంతపూర్, హబ్సిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో వర్షం పడింది. దానగర్, లింగంపల్లి, కూకట్ పల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, మదీనగూడ, జగద్గీర్ గుట్ట, గాజులరామారం ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు కురిశాయి. ఇక మరికొన్ని గంటల్లో నాదర్ గుల్, బాలాపూర్, ఆదిబట్ల, అరాంఘర్, తుర్క యంజాల్ ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడకక్కడ మెరుపులు, ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో కూడా ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గాలి వేగం 30 -40 కిమీ వేగంతో వీస్తాయని వెల్లడించింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version