తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాల, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

కామారెడ్డి లాంటి ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, ఏలూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు కూడా భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. ఇలాంటి నేపథ్యంలో ఏపీ ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అమరావతి వాతావరణ శాఖ సూచనలు చేసింది.