తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలా జిల్లాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గత రెండు రోజుల నుంచి కామారెడ్డి, మెదక్ అలాగే సిద్దిపేట జిల్లాలో అత్యంత ప్రమాదకరమైన వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి అలాగే మెదక్ జిల్లాలు చాలా వరకు నీటిలో మునిగిపోయాయి.

పాలన మొత్తం అస్తవ్యస్తమైంది. ఇలాంటి నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లాలో రెండు రోజుల పాటు హాలిడే ప్రకటించారు. ఇప్పటికే గురువారం హాలిడే ఇచ్చిన జిల్లా యంత్రాంగం.. ఇవాళ అలాగే రేపు కూడా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు హాలిడే ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేసింది. భారీ వర్షాలు అలాగే వరదల కారణంగా ఈ రెండు రోజులపాటు సెలవులు ఉండనున్నట్లు వెల్లడించింది. అటు మెదక్ జిల్లాలో ఇవాళ ఒక్కరోజు విద్యాసంస్థలకు హాలిడే ఉండనుంది. మిగతా జిల్లాల్లో యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయి.