విద్యుత్ బకాయిలు..సిరిసిల్ల మున్సిపల్ లో కరెంట్‌ నిలిపివేత !

-

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణమైన సంఘటన జరిగింది. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదంటూ సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు సెస్ అధికారులు. దీంతో అంధకారంలోనే విధులు నిర్వహిస్తున్నారు మున్సిపల్ సిబ్బంది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కంప్యూటర్, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి.

Cess officials stopped power supply to Sirisilla Municipal Office for non-payment of electricity dues.

సెస్ కు 4 కోట్ల 58 లక్షల 90 వేల రూపాయల విద్యుత్ బకాయి ఉంది సిరిసిల్ల మున్సిపాలిటీ. అయితే… డిసెంబర్, జనవరిల్లో నోటీసులు జారీ చేసినా స్పందించలేదు మున్సిపల్ అధికారులు. దాంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన సెస్ అధికారులు…బిల్లు కడితేనే.. కరెంట్‌ ఇస్తామని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version