Hyd: హైదరాబాద్ మరో విషాదం చోటు చేసుకుంది. శుభనందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి..ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హబ్సిగూడలో విషాదం జరిగింది. విజయలక్ష్మి ఆర్కేడ్ లో శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో మంటలు…ఒక్క సారిగా చెలరేగాయి.
మంటలు అంటుకున్న నేపథ్యంలో బోర్డు తొలగించే ప్రయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఇక ఈ సంఘటన పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు సూర్యపేట జిల్లా కేసముద్రం కి చెందిన మల్లేష్(29), బాలు(32) గా గుర్తించారు పోలీసులు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.