ఇవాళ తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి ములుగు కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కేంద్రం రెడ్ జారీ చేయడం జరిగింది.

మిగిలిన జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని కూడా సూచనలు చేసింది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి, ఏలూరు ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి అని హెచ్చరికలు గాని చేసింది అమరావతి వాతావరణ శాఖ. మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు పడతాయి అని చెప్పింది.