హైదరాబాద్ మహానగరంలో నిన్నటి నుంచి వర్షం దంచి కొడుతూనే ఉంది. ఈయన అర్ధరాత్రి 10 గంటలకు ప్రారంభమైన వర్షం.. ఇప్పటికీ పలు ప్రాంతాల్లో పడుతూనే ఉంది. అర్ధరాత్రి కొంత మేర తగ్గినా కూడా… తెల్లవారుజాము నుంచి వర్షం తీవ్రత పెరిగింది. దీంతో హైదరాబాద్ రోడ్ల పైన భారీగా నీరు నిలిచిపోయిన పరిస్థితులు నెలకొన్నాయి.

హైదరాబాద్ మహానగరంలో ఇవాళ కూడా విస్తారంగా వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాదు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. కాగా, తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని చాలా జిల్లాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఒక్కో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడి.. పరిస్థితులు ఆస్తవ్యస్తమవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇవాళ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల పాఠశాలలకు హాలిడే ప్రకటించారు.