సంక్రాంతి ఎఫెక్ట్ : పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా నిలిచిన వాహనాలు

-

సంక్రాంతిని పురస్కరించుకొని ప్రయాణీకులు తమ స్వంత ఊళ్లకు బారులు తీరారు. విద్యాసంస్థలకు సంక్రాతి సెలవులు ప్రారంభమయ్యాయి. పిల్లాపాపలతో నగరవాసులు ఊర్లకు బయలుదేశారు. దీంతో హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. అయితే టోల్‌గేట్ల వద్ద ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా అధికారులు ముందుగానే చర్యలు తీసుకున్నారు. టోల్ బూత్‎లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి.

కాగా, జాతీయ రహదారిపై యాక్సిడెంట్‌ జోన్‌, బ్లాక్‌ స్పాట్‌ల వద్ద అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. 24 గంటలపాటు హైవేపై గస్తీ నిర్వహించేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేశారు. పంతంగితోపాటు కొర్లపాడ్‌, చిల్లకల్లు టోల్‌ప్లాజాల వద్ద పటిష్ట చర్యలు చేపట్టారు.

ఇక ఫాస్టాగ్ సౌకర్యం లేనివారు ఎక్కువసేపు ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణీకులు చెబుతున్నారు. ప్రయాణీకుల రద్దీ పెరిగే అవకాశం ఉన్న విషయాన్ని గుర్తించి ముందు జాగ్రత్తలు తీసుకొంటే పరిస్థితి మరోలా ఉండేదని ప్రయాణీకులు అభిప్రాయపడుతున్నారు.

ఇక విజయవాడకు సమీపంలోని పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. పొట్టిపాడు టోల్‌ప్లాజా వద్ద కూడ సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version