నిబంధనలు పాటించని ట్రావెల్స్ పై ఆర్టీఏ అధికారులు కొరడా విధిస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై ఆర్టీఏ దాడులు రెండోరోజు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో హయత్నగర్ లోని విజయవాడ హైవే పై ఉదయం నాలుగు గంటల నుండి రవాణా శాఖ అధికారుల తనిఖీలు చేపట్టారు. సరైన పత్రాలు, ఫిట్నెస్, ఫైర్ సేఫ్టీ లేని ఐదు బస్సులను సీజ్ చేశారు అధికారులు.
సంక్రాంతి పండగ నేపథ్యంలో వివిధ ప్రాంతలలో స్థిరపడిన వారు తమ సొంతూళ్లకు వెళ్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో రద్దీ ఎక్కువగా రద్దీ నెలకొనడంతో చాలా మంది ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే పండగను క్యాష్ చేసుకునే క్రమంలో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ నిర్వహకులు ప్రయాణికులు నుంచి ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారు.ఆర్టీసీ కంటే రెండు రేట్లకు పైగా రేట్లతో చార్జీలు వసూళు చేస్తున్నారు. హైద్రాబాద్ నుంచి శ్రీకాకుళంకు 3500 నుంచి 4000 వేల వరకు టికెట్ వసూలు చేస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రేట్లు పెంచినా పండుగకు ఊరు వెళ్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు.