ఆర్మీ హెలికాప్టర్ క్రాష్… ఇప్పటి వరకు 6 మృతదేహాల గుర్తింపు

-

తమిళనాడులో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో దేశ తొలి సీడీఎస్, త్రివిధ ధళపతి బిపిన్ రావత్ తో పాటు ఆయన సతీమణి, 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరు మాత్రమే తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే బిపిన్ రావత్ దంపతులతో పాటు మరో బ్రిగేడియర్ లిడ్డర్ మృతదేహాలను గుర్తించడంతో వారి అంత్యక్రియలు పూర్తయ్యాయి.

కాగా మిగిలిన వారి మృతదేహాలు గుర్తుపట్టని రీతిలో ఉండటంతో డీఏన్ఏ పరీక్షలు తప్పనిసరి అయింది. హెలికాప్టర్ క్రాష్ సమయంలో మంటల్లో కాలిపోవడంతో గుర్తుపట్టలేని రీతిలోకి మారాయి. ప్రస్తుతం మరో ఆరుగురి మృతదేహాలను గుర్తించారు. ఇందులో జేడబ్ల్యూఓ ప్రదీప్, వింగ్ కమాండర్ చౌహాన్, జేడబ్ల్యూఓ రాణా ప్రతాప్ దాస్, స్వ్కాడ్రన్ లీడర్ కుల్దీప్ సింగ్, లాన్స్ నాయక్ సాయి తేజ, లాన్స్ నాయక్ వివేక్ కుమార్‌ల మృత దేహాలను ఇప్పటివరకు గుర్తించారు. మిగిలిన వారిని  గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version