SBI ఖాతాదారుల‌కు అలర్ట్.. నేడు ఇంట‌ర్ నెట్ సేవ‌లు బంద్ !

-

ఎస్‌బీఐ ఖాతాదారుల‌కు అల‌ర్ట్‌. ఎస్ బీఐ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు శ‌నివారం కొన్ని గంటల పాటు అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ఎస్‌బీఐ అధికారికంగా ప్ర‌క‌ట‌న చేసింది. ఈ స‌మ‌యంలో.. ఎస్ బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సేవ‌ల‌తో పాటు యోనో, యోనో లైట్‌, యూపీఐ సేవ‌లు సైతం నిలిచిపోతాయ‌ని.. ఎస్‌బీఐ ప్ర‌క‌ట‌న చేసింది. శ‌నివారం రాత్రి 11.30 గంట‌ల నుంచి ఆదివారం వేకువ జామున 4.30 వ‌ర‌కు అంటే 300 నిమిషాల పాటు ఈ సేవ‌లు నిలిచిపోనున్న‌ట్లు..ఎస్‌బీఐ త‌న అధికారిక ట్విట‌ర్ ఖాతాలో వెల్ల‌డించింది.

సాంకేతిక అప్ గ్రేడేష‌న్ ప్ర‌క్రియ‌లో భాగంగా… సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డుతోంద‌ని.. ఎస్‌బీఐ వెల్ల‌డించింది. మెరుగైన బ్యాంకింగ్ సేవ‌లు అందించే ఈ ప్ర‌యత్నంలో.. కలుగుతున్న ఈ అసౌక‌ర్యానికి స‌హ‌క‌రించాల‌ని ఖాతాదారుల‌ను ఎస్‌బీఐ కోరింది. ఇక దేశ వ్యాప్తంగా.. ఎస్ బీఐ కి 22 వేల బ్యాంక్ శాఖ‌లు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. అక్టోబ‌ర్ 8 వ‌తేదీన సైతం ఇదే త‌ర‌హాలో మెయింటెన్స్ లో భాగంగా.. ఎస్ బీఐ ఇంట‌ర్నెట్ సేవ‌ల‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version