హెలికాప్టర్ ప్రమాదం.. మృతదేహాల గుర్తింపు పూర్తి.. నేడు తెలుగు తేజం సాయి తేజ అంత్యక్రియలు

-

తమిళనాడు నీలగిరి జిల్లాలో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో అమరులైన సైనికులందరి మృతదేహాల గుర్తింపు పూర్తయింది. శనివారం 10 మంది మృతదేహాల గుర్తించి వాటిలో శనివారం 6 మృతదేహాల వారి బంధువులకు అప్పగించారు. మిగిలిన నాలుగు మృతదేహాలను ఆదివారి బంధువులకు అప్పగించనున్నారు. శనివారం గుర్తించిన వాటిలో జూనియర్ వారెంట్ ఆఫీసర్లు ప్రదీప్, రాణా ప్రతాప్ దాస్​, వింగ్ కమాండర్​ పి.ఎస్​.చౌహాన్​, స్క్వాడ్రన్ లీడర్ కె.సింగ్, లాన్స్​నాయక్​లు బి.సాయితేజ, వివేక్ కుమార్ ఉన్నారు. శనివారం సాయంత్రం లెఫ్టినెంట్ కర్నల్​ హర్​జిందర్ సింగ్​, హవల్దార్ సత్పాల్, నాయక్ గుర సేవక్ సింగ్, నాయక్​ జితేందర్​ కుమార్​ల భౌతికకాయాలను గుర్తించారు. ప్రమాదంతో శరీరాలు కాలిపోవడం గుర్తుపట్టని రీతిలో ఉండటంతో డీఎన్ఏ పరీక్షలు అనివార్యమయ్యాయి.

ప్రమాదంలో మరణించిన సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్ మృతదేహాలతో పాటు.. బ్రిగేడియర్ లిడ్డర్ మృతదేహాన్ని గుర్తించడంతో శుక్రవారమే వీరి అంత్యక్రియలు జరిగాయి. తెలుగు తేజం సాయితేజ అంత్యక్రియలు నేడు జరుగనున్నాయి.

బుధవారం తమిళనాడు నీలగిరి జిల్లా కూనూర్ ప్రాంతంలో జరిగిన ఆర్మీహెలికాప్టర్ ఘటనలో దేశతొలి సీడీఎస్ బిపిన్ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక రావత్.. మరో 11 మంది అమరులయ్యారు. ఇందులో ఒక్కరు మాత్రమే తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version