కుప్ప కూలిన హెలికాప్టర్..16 మంది మృతి.. !

-

రష్యాలో ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్ కుప్పకూలడంతో 16 మంది మృతి చెందారు. రష్యా తూర్పు ప్రాంతంలోని కమ్మట్చా లో ఉన్న అగ్నిపర్వతాల ను, పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు నిత్యం పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ద్వీపకల్పంలో పర్యటించడం కోసం వెళ్లిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ గురువారం తెల్లవారుజామున కూలిపోయింది. హెలికాప్టర్ లో మొత్తం 16 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.

helicopter crash in russia

పదహారు మందితో వెళుతున్న హెలికాప్టర్ తూర్పు ప్రాంతంలోని కమ్చట్కా ద్వీపకల్పం లోని కురిల్ సరస్సులో కూలిపోయింది. ఈ హెలికాప్టర్ లో ముగ్గురు సిబ్బంది ఉండగా మిగతావారంతా ప్రయాణికులు అని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహాలను వెతికే పనిలో ఉన్నారు. ఇప్పటికే తొమ్మిది మందిని ఈతగాళ్లు గుర్తించారు. మరో ఏడుగురి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version