ఆ దేశంలో మురుగు నుంచి తాగునీరు.. ఎలాగో తెలుసా?

-

భవిష్యత్తు తరాలకు నీరు అందించేందుకుగాను ప్రస్తుతం నీటిని పొదుపుగా యూజ్ చేసుకోవాలని పర్యావరణవేత్తలు, నిపుణులు, పెద్దలు చెప్తుండటం మనం చూడొచ్చు. అయితే, మనదేశంలో నీటి లభ్యత బాగానే ఉన్నది. అయినప్పటికీ వాటర్‌ను కేర్ ఫుల్‌గా యూజ్ చేయాలని సూచిస్తున్నారు. భవిష్యత్తులో నీటి సంక్షోభం ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే వాటర్ యూసేజ్ పట్ల అధికారులు, ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నది.

ఇదిలా ఉండగా మన దేశం సంగతి పక్కన బెడితే విదేశాల్లో ఆల్రెడీ నీటి సంక్షోభం ఏర్పడింది. వాటర్ కోసం వారు ఇతర దేశాలను అడగాల్సి వస్తున్నది. సింగపూర్‌లో నీటి లభ్యత అతి తక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే సింగపూర్ సర్కారు వినూత్న ప్రయగానికి పూనుకున్నది. అదేంటంటే..

సింగపూర్ ప్రజలు తాగు నీటి కోసం ప్రతీ సారి మలేషియా దేశంపై ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో అధునాతన వ్యవస్థతో ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు సింగపూర్ అదికారులు. ఈ ప్లాంట్ ద్వారా మురుగునీటిని శుద్ధి చేసి వాటిని తాగు నీరుగా మార్చి జనాలకు అందించాలనుకుంటున్నారు. భారీ పంపులు, టన్నెల్స్‌తో కూడిన హైటెక్ ప్లాంట్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు. ఇందుకుగాను ప్లాంట్‌ భూగర్భంలో భారీ పంపులు అమర్చారు. తద్వారా మురుగునీటిని శుద్ధి చేయాలని భావిస్తున్నారు.

ఈ ప్లాంట్ యూసేజ్ వల్ల సముద్రపు కాలుష్యం తగ్గుతుందని ఆ దేశ వాటర్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. అయితే, ఇలా భూగర్భ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మురుగు నుంచి తాగు నీరును తీసుకొస్తే భవిష్యత్తులో నీటి కొరతను కచ్చితంగా అధిగమించొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ఇకపోతే శుద్ధి అయిన తర్వాత వచ్చిన తాగునీటిని పారిశ్రామిక అవసరాలకూ కేటాయిస్తామని అంటున్నారు. అయితే, తమ ఫస్ట్ ప్రయారిటీ సిటీలోని రిజర్వాయర్స్ ద్వారా ప్రజలకు అందించడమేనని చెప్తున్నారు. మురుగు నుంచి తాగునీరు తేవడం కోసం ఏర్పాటు చేసే ప్లాంట్స్‌కు‌గాను సింగపూర్ సర్కారు దాదాపు 7.4 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తోందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version