బ్రేకింగ్ : హేమంత్ హత్య కేసులో కీలక నిందితుల అరెస్ట్

-

హేమంత్ హత్య కేసులో కీలక నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్టు చెబుతున్నారు. 18 మంది నిందితుల్లో తాజాగా అదుపులోకి తీసుకున్న కృష్ణను ఎ5గా, బాషాను ఎ6గా చేర్చారు పోలీసులు. అయితే మరో ఇద్దరు నిందితులు అంటే ఎ17 జగన్ ఎ18 సయ్యద్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. ఇక ఎ1 యుగేంధర్ రెడ్డితో కలిసి ఎ5 కృష్ణ, ఎ4 బిక్షపతి యాదవ్ లు హత్యకు ఒప్పందం చేసుకున్నారు. హేమంత్ హత్య తర్వాత జగన్, సయ్యద్ లు నిందితులకు సహకరించినట్టు గుర్తించారు.

ఎ2 లక్షారెడ్డి వద్ద బిక్షపతి, కృష్ణ, బాషా లక్ష అడ్వాన్స్ గా తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ హత్య తరవాత మిగతా డబ్బు ఇస్తామని ఒప్పందం చేసుకున్నట్టు చెబుతున్నారు. నిందితులను పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. కూతురు కులాంతర వివాహం చేసుకోవడంతో అవమానంగా భావించి తల్లిదండ్రులు నాలుగు నెలలుగా ఇంట్లోనే ఉండిపోయారు. యుగంధర్ మాత్రం తన చెల్లి అర్చన బాధ చూడలేక అవంతిని హేమంత్‌ నుంచి విడదీయాలని నిర్ణయించుకుని రకరకాల ప్లాన్స్ వేశారు. అవి వర్కౌట్ కాకపోవడంతో ఏకంగా లేపెయడానికి ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news