విద్యుత్తు వాహనాల వల్ల పర్యావరణానికి మంచిదా?

-

విద్యుత్‌ వాహనాలతో పర్యావరణానికి ముప్పు కాదు మేలు కలుగుతుందా ? అనే విషయానికి ప్రముఖ డేమియల్‌ ఎర్నస్ట్‌ విశ్వవిద్యాలయం పరిశోధకులు ఓ ప్రకటన వెలువరించారు.వీరి లెక్క ప్రకారం.. విద్యుత్తు వాహనాలు 7 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, గాసోలిన్‌(పెట్రోలు, డీజిల్‌) వాహనాల కంటే ఎక్కువ కార్బన్‌ డయాక్సైడ్‌ను వెలువరిస్తాయట.
గాసోలిన్‌ కార్లు వినియోగించేటప్పుడు వాటి నుండి హానికారక కార్బన్‌ బయటకు రావాలంటే 21 వేలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాలట.దీన్ని బ్రేక్‌ ఈవె న్‌ పాయింట్‌ అని పిలుస్తారు. అయితే విద్యుత్తు కార్ల నుండి కర్బన్‌ ఉద్గారాలు రావడానికి ఎంత కాలం పడుతుంది, ఎన్ని రోజులకు బ్రేక్‌ ఈవె న్‌ వస్తుంది. ఇప్పుడు ఆటో మొబైల్‌ రంగంలో ఇదే చర్చ. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం!

కేంద్ర ప్రభుత్వం కూడా హరిత రవాణాకు ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో ఈ–కార్ల గురించి అంతర్జాతీయంగా వస్తున్న నివేదికలు పరిశీలించదగ్గవే. ఆర్గోన్‌ కి చెందిన గ్రీన్‌ హౌస్‌ గ్యాసెస్, రెగ్యులేటడ్‌ ఎమిష న్‌ అండ్‌ ఎనర్జీ యూజ్‌ ఇన్‌ టెక్నాలజీస్‌ (గ్రీట్‌) మోడల్‌ను యూ.ఎస్‌ పర్యావరణ పరిరక్షణ ఏజెన్సీ (ఈపీఏ) వాడుతోంది. రాయిటర్స్‌ పరిశోధన ప్రకారం మిడ్‌ సైజ్‌ విద్యుత్తు వాహనం ఒకమైలుకు 47 గ్రాములు కార్బన్‌డయాక్సైడ్‌ను జనరేట్‌ చేస్తుంది. అయితే ఇది ఎక్స్‌ట్రాక్షన్‌ , ప్రొడక్షన్‌ సమయంలో మాత్రమే. వినియోగదారు దగ్గరకు చేరేటప్పటికి 8.1 మిలియన్‌ గ్రాములు ఉత్పత్తి అవుతుంది. అదే గాసోలిన్‌ వాహనం అయితే మైలుకి 32 గ్రాములు ఉత్పత్తి చేస్తుంది.

ఒక్కో విద్యుత్తు వాహనం కర్బన ఉద్గారం బ్రేక్‌ ఈవెన్‌ పాయింట్‌ 15 – 20 వేల మధ్య ఉంటుంది. అయితే అది ఆ వాహనం నడిచే ప్రాంతం, దేశం మీద ఆధార పడి ఉంటుంది. విద్యుత్తు వాహనాలకు మారడం మంచిది అని ఆ సంస్థ సూచిస్తోంది. దాని వల్ల లాంగ్‌ టర్మ్‌ ఉపయోగాలు ఉంటాయంటోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version