యువ‌తి చేతిలో మోసపోయి.. కేసుపెట్టిన హీరో విశాల్..!

-

విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మిస్తూ కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు హీరో విశాల్. ప్ర‌స్తుతం చ‌క్ర అనే సినిమాలో న‌టిస్తుండ‌గా, ఇటీవ‌ల చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ విడుద‌లైంది. ఇది ఫ్యాన్స్‌ కి సంతోషాన్ని క‌లిగించింది. ఈ క్రమంలో విశాల్ ఓ యువతిపై ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. తాను తన బ్యానర్‌ లో చక్ర సినిమా తీస్తుండగం ఆమె పాల్పడిన మోసాలు బయటపడ్డాయని తెలిపాడు. విశాల్ కంపెనీలో పనిచేసే సదరు మహిళ గత ఆరేళ్లలో రూ .45 లక్షలకు పైగా మోసం చేసి డబ్బు కూడ‌పెట్టిన‌ట్టు..

ఈ డబ్బుతో ఇల్లు కూడా కొన్నదని. ఈ విష‌యం తెలుసుకున్న  ప్రొడక్షన్ హౌస్ మేనేజర్ హరి చెన్నైలోని వడపాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్ర‌స్తుతం ఆమెపై కేసు న‌మోదు చేసి విచారిస్తున్నారు. నిర్మాతగా చాలా ప్లానింగ్ తో సినిమాలు చేస్తూ బిజినెస్ మెన్ గా కూడా తన మార్క్ చూపిస్తున్న విశాల్ ని ఒక మహిళ మోసం చేయడం ఇప్పుడు కోలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం విశాల్  చ‌క్ర సినిమాలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version