బ్రేకింగ్ : హీరో విశాల్‌ కి కరోనా..!

-

హీరో విశాల్ కుటుంబానికి కరోనా పాజిటివ్ అంటూ కోలీవుడ్‌లో వస్తున్న వార్తలు నిజమేనంటూ క్లారిటీ ఇస్తూ హీరో విశాల్ ట్వీట్ చేశారు. ‘‘ఆ వార్తలు నిజమే. మా నాన్నకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. ఆయనకి సహాయం చేసే క్రమంలో నాకు కూడా జ్వరం, జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపించాయి. అలాగే ఇవే లక్షణాలు నా మేనేజర్‌లో కూడా కనిపించాయి. మేమంతా ఆయుర్వేదిక్ మెడిసెన్ తీసుకున్నాము.

ఒక వారంలో ప్రమాదం నుంచి బయటపడ్డాము. ప్రస్తుతానికి మా ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఈ విషయం తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గుడ్ బై..’’ అని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ మహమ్మారి బారిన ఇప్పటికే చాలామంది పడ్డారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి బిగ్ బి అమితాబచ్చన్ ఫ్యామిలీతో పాటు ఎందరో ఈ మహమ్మారి బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version