హీరోలు నాచురల్ లుక్ కోసం పోటీ పడుతున్నారు. ఆ మధ్య వచ్చిన రంగస్థలం సినిమా నుంచి మొన్న టీజర్ వచ్చిన పుష్ప వరకు చూస్తే.. హీరోలు మేకప్ పక్కన పెట్టి గడ్డాలు మీసాలు పెంచేసుకుంటున్నారు. నేచురల్ గానే కాకుండా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ కూడా చేస్తున్నారు.
రామ్ చరణ్ చెవిటివాడిగా చేస్తే.. రవితేజ కళ్లు లేని వాడిగా యాక్ట్ చేశాడు. నాని మతిమరుపుతో, ఎన్టీఆర్ నత్తి ఉన్న పాత్రల్లో జీవించి మెప్పించారు. ఇవన్నీ ఇంతకు ముందు తమిళ సినిమాల్లోనే ఉండేవి. కానీ కథ డిమాండ్ చేస్తే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తామంటున్నారు మన టాలీవుడ్ హీరోలు. ఎక్కువగా మేకప్ లేకుండా కేవలం నేచురల్ లుక్స్‌లో కనిపించాలని, అప్పుడే జనాలకు రీచ్ అవుతామని ఇలా చేస్తున్నారు. ఏదైనా ఈ సాంప్రదాయం మంచిదే అని చెప్పాలి.