జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్ మసాలా. ఆ పేరుకే కొన్ని అభిమాన వర్గాలు ఉన్నాయి. ఇక యంగ్ టైగర్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు ఆంధ్రాలో పండగే. మరీ ముఖ్యంగా రాయలసీమలో ఏ హీరోకు లేనంత ఫ్యాన్స్ ఈయనకు ఉన్నారు. అందుకే ఆయన ఎక్కువగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో సినిమాలు చేస్తుంటారు.
ఇక డ్యాన్స్, నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే ఎన్టీఆర్ ఈ మధ్య చాలా ముందుచూపుతో ఆలోచిస్తున్నాడు. సక్సెస్ఫుల్ డైరెక్టర్లను లైన్ లో పెడుతూ కెరీర్‌ను జాగ్రత్తగా బిల్డ్ చేసుకుంటున్నాడు. నాన్నకు ప్రేమతో సినిమా నుంచి ఇప్పుడు కొరటాలశివతో చేస్తున్న 30వ సినిమా వరకు ఇదే ఫార్ములాను కంటిన్యూ చేస్తున్నాడు.
టాలీవుడ్లో ఎవరైనా బిగ్ హిట్ కొడితే చాలు.. వెంటనే ఆ డైరెక్టర్‌ను లాగేసుకుంటున్నాడు. కాకపోతే వారందరినీ వరుసగా లైన్లో పెట్టడంతో వెయిట్ చేయాల్సి వస్తోంది డైరెక్టర్లు. ఇందులో చాలామంది ఎన్టీఆర్‌తో సినిమా పోగొట్టుకోవడం ఇష్టంలేక ఎదురు చూస్తుంటారు. ఇప్పుడు తనకు అత్యంత పరిచయస్తుడైన సుకుమార్ శిష్యుడిని లైన్ పెట్టేశాడు. ఉప్పెనతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబుతో ఓ సినిమా ప్లాన్ చేశాడు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా చేయడానికి మరో ఏడాది ఆగాల్సిందే. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్ ఆర్ ఆర్ అయిపోయాక కొరటాల మూవీని కంప్లీట్ చేయాలి. ఈ రెండింటి తర్వాతే బుచ్చిబాబుతో సినిమా ఉంటుంది. మరి బుచ్చిబాబు వెయిట్ చేస్తాడా లేదా అనేది చూడాలి.