సహజీవనం గురించి విజయ్ దేవరకొండ హీరోయిన్ కామెంట్స్…!

-

కేథరీన్’ చేసినవి తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మాయికి మంచి క్రేజ్ వచ్చింది. ఎప్పుడో ఒక సినిమా చేస్తూ హడావుడిగా లేకుండా మంచి పాత్రలు చేస్తూ వస్తుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఆమె నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ తర్వాత తక్కువ సినిమాల్లోనే కనపడింది ఈ అమ్మాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ సరసన ఒక సినిమాలో నటిస్తుంది కేథరిన్.

వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రానున్న నేపధ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వులో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రేమ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. “ప్రేమ మీద నాకు మంచి అభిప్రాయముంది. అదొక ఎమోషన్‌. అమ్మాయి, అబ్బాయి మధ్య ఉన్నదే ప్రేమ కాదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అందరి మధ్య ప్రేమ ఉంటుంది.

నేను ఆ ప్రేమను గౌరవిస్తాను. సహజీవనం అనేది అందరికీ సరిపడదు. ఓ మనిషిని అర్థం చేసుకొని, పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉంటే అది కరెక్టే. పెళ్లి అనేది ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగే జీవితకాల ఒప్పందం. ఆ ప్రేమ, పెళ్లి వ్యవహారాన్ని గౌరవిస్తా అంటూ మాట్లాడింది. అదే విధంగా సినిమా గురించి మాట్లాడిన ఆమె, నేనొక సినిమా చేశా అంటే నా నటన సినిమాకు బలం కావాలని అన్నారు జగన్.

కానీ తగ్గించేలా ఉండకూడదని చెప్పింది. నా వల్ల ఫలానా సీన్‌ చెడిపోయిందని నా చెవిన పడితే అసలు తట్టుకోలేనన్న ఆమె… అయితే ఇప్పటి వరకూ ఐతే అలాంటి సిచ్చువేషన్‌ ఎదురుకాలేదని చెప్పింది. ఏ రంగంలోనైనా మనకు ఒక రూపాయి వస్తుందంటే అది మనం చేసే పనిని బట్టే కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేసింది. తాను ఆ విలువను నేను నిలబెట్టుకుంటా అంటూ మాట్లాడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version