బుట్టబొమ్మ పూజా హెగ్డేకు గాయం.. ఆందోళనలో ఫ్యాన్స్

-

కెరీర్ ప్రారంభం నుంచి వరుస హిట్ లతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ.. బుట్టబొమ్మ.. పూజా హెగ్డే. ఆచార్య, బీస్ట్ వంటి సినిమాలు ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకున్నా ఈ బుట్టబొమ్మ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఓవైపు సినిమాలతో బిజీబిజీగా ఉంటూనే పూజా హెగ్డే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గురించి అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ ని ఖుష్ చేస్తూ ఉంటుంది.

అయితే తాజాగా పూజా హెగ్డే పెట్టిన పోస్టు చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. కాలికి గాయమై కట్టుకట్టి ఉన్న ఫొటోను పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో  వైరల్​గా మారింది. పూజ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ నెటిజన్లు విపరీతంగా కామెంట్లు పెడుతన్నారు. మరికొందరు పూజ ఐరెన్ ​లెగ్​కు ఏమైంది అంటూ హార్ష్ కామెంట్స్ చేస్తున్నారు.

మరోవైపు పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. హిందీలో సర్కస్, భాయిజాన్​, తెలుగులో మహేశ్​ ఎస్​ఎస్​ఎమ్​బీ 28 తదితర చిత్రాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version