టాలివుడ్ హీరోలపై రకుల్ సీరియస్ కామెంట్స్…!

-

దక్షినాది లో హీరోలకు ఉండే ఇమేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వాళ్ళను చూడటానికి అభిమానులు ఎంతో పోటీ పడుతూ ఉంటారు. స్టార్ హీరోలకు ఉండే ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే హీరోయిన్లకు మాత్రం పెద్దగా క్రేజ్ ఉండదు. ఎక్కడో ఒక హీరోయిన్ మినహా టాలివుడ్ లో పెద్దగా హీరోయిన్లు క్లిక్ అయిన సందర్భం అంటూ ప్రత్యేకంగా ఏదీ లేదు.

టాలివుడ్ హీరోల స్టార్ ఇమేజ్ పై రాధికా ఆప్టే లాంటి వారు గతంలోనే సంచలన వ్యాఖ్యలు కూడా చేసారు. తాజాగా రాకుల్ ప్రీత్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుత౦ ముంబైలో ఉంటున్న ఈ పొడుగు కాళ్ళ సుందరి దక్షిణాది హీరోల కోసమే జనం వస్తారని చెప్పింది. దక్షిణాది ఇండస్ట్రీలో హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువగా ఇమేజ్ ఉంటుందని.. వాళ్లను చూడ్డానికి థియేటర్స్‌కు ప్రేక్షకులు వస్తారని చెప్పింది.

అందుకే సౌత్‌లో హీరోలకు భారీ రెమ్యునరేషన్ ఉంటుందని, తనకు ఈ లాజిక్ తెలుసు కాబట్టే తను కూడా ఎప్పుడూ పారితోషికం కోసం బెట్టు చేయలేదని సౌత్‌లో హీరోలతో సమానంగా హీరోయిన్స్‌కు రెమ్యునరేషన్ ఇవ్వాలని తానెప్పుడూ డిమాండ్ చేయలేదని, చేయనని కూడా స్పష్టం చేసింది. అయితే కొంత మంది హీరోయిన్లు మాత్రం హీరోతో పాటు మేము కష్ట పడుతున్నాం మరి మా పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version