అలర్ట్‌.. భద్రాద్రిలో హై అలర్ట్‌.. నాయకులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్న పోలీసులు

-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు, గుండాల. ఆళ్లపల్లి మండలాల్లో హై అలెర్ట్ ప్రకటించారు పోలీసులు. ఏజెన్సీ గ్రామాలలో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే వాహన తనిఖీలు నిర్వహిస్తున్న చేపట్టారు పోలీసులు. అంతేకాకుండా.. ప్రముఖ రాజకీయ నాయకులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పలు గ్రామాలలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. పీఎల్‌జీఏ వారోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ, చత్తీస్‌గఢ్‌తో సరిహద్దులో మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచేందుకు శనివారం తెల్లవారుజామున భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించాయి.

ఈ క్రమంలోనే ఐదుగురు మిలీషియా సభ్యుల పట్టుబడ్డారు. అరెస్టయిన వారిని ఛత్తీస్‌గఢ్‌లోని కిస్టారంకు చెందిన వెడమ భీమయ్య, 35, సోడి మూయా, 20, పొడియం అడమయ్య, 26, పూనెం నగేష్, 30, జట్టపాడుకు చెందిన మడకం నగేష్ (20)గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వీరు తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులు వెల్లడించారు. గత ఏడాది చర్ల మండలం రామచంద్రాపురం అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ పోలీసులను లక్ష్యంగా చేసుకుని బూబ్ ట్రాప్‌లు అమర్చిన కేసులో వీరి ప్రమేయం ఉన్నట్లుగా తెలిసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version